సనత్‌నగర్ టిమ్స్‌లో ఉద్యోగాల భర్తీ…
- టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
- జూలై 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పూర్తిచేసిన ప్రభుత్వం, ఇప్పుడు సిబ్బంది నియామకాలపై దృష్టి సారించింది. ఆసుపత్రి పరిపాలనను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది భర్తీ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించిన నేపథ్యంలో కీలక ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ క్రమంలో టిమ్స్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నిమ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలపరిమితికి టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ విభాగాల్లో మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.
టిమ్స్‌లో 122 ఉద్యోగాలు.. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలంటే?
సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో 122 ఖాళీల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ లో.. టెక్నికల్ విభాగంలో 98 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 24 పోస్టులు ఉన్నాయి.
- టెక్నీషియన్ పోస్టులు – 98
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 – 34
- అనస్థీషియా టెక్నీషియన్ – 20
- ఎక్స్‌రే/సి-ఆర్మ్ టెక్నీషియన్ గ్రేడ్-2 – 10
- ఈసీజీ టెక్నీషియన్ – 6
- క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ – 6
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్-2 – 4
- సీటీ టెక్నీషియన్ గ్రేడ్-2 – 4
- ఎంఆర్ఐ టెక్నీషియన్ – 4
- సీఎస్ఎస్డీ టెక్నీషియన్ – 4
- ఈఈజీ టెక్నీషియన్ గ్రేడ్-2 – 2
- బయోమెడికల్ టెక్నీషియన్ – 2
- ఆడియోమెట్రీ టెక్నీషియన్ – 1
- ఆడియో విజువల్ టెక్నీషియన్ – 1
- అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు – 24
- సీనియర్ అసిస్టెంట్ – 5
- సూపర్వైజర్ – 4
- హెల్త్ ఇన్స్పెక్టర్ – 4
- అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 2
- డిప్యూటీ రిజిస్ట్రార్ / డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్ – 2
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ / అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్ – 2
- అకౌంటెంట్ – 2
- మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (జూనియర్) – 1
- స్టాటిస్టీషియన్ – 1
- అకౌంట్స్ ఆఫీసర్ / ఫైనాన్షియల్ కంట్రోలర్ – 1
ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయనున్నారు.
అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వివరాలు ఇవే…
ఖాళీల వివరాలు : మొత్తం 122 పోస్టుల్లో 98 టెక్నికల్ పోస్టులు, 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, సీఎస్ఎస్డీ టెక్నీషియన్ వంటి పలు టెక్నికల్ పోస్టులతో పాటు సీనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్, హెల్త్ ఇన్స్పెక్టర్, అకౌంటెంట్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తదితర అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయోపరిమితి : 2026 జూలై 1 నాటికి టెక్నికల్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 45 సంవత్సరాలు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు : దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా లేదా పీజీ అర్హత ఉండాలి. అలాగే 500 లేదా 750 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రుల్లో కనీసం ఒకటి నుంచి ఐదేళ్ల వరకు పని చేసిన అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. రుసుమును “ది డైరెక్టర్, నిమ్స్, హైదరాబాద్” పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : దరఖాస్తుల సంఖ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 10 లోపు దరఖాస్తులు వస్తే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 11 నుంచి 30 వరకు దరఖాస్తులు వస్తే మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్ చేసి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 30 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే రాత పరీక్ష లేదా నైపుణ్య పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి? : అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు లేదా సీవీతో పాటు విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాలు, ఇతర అవసరమైన పత్రాల స్వీయ ధృవీకరణ చేసిన ప్రతులను జతచేయాలి. కవర్‌పై దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును స్పష్టంగా పేర్కొని 2026 జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌కు చేరేలా పంపించాలి.
