అంబేద్కర్‌కు ఘ‌న‌నివాళులు…

అంబేద్కర్‌కు ఘ‌న‌నివాళులు…

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : నవభారత నిర్మాత, భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా మంగళవారం ఉరవకొండ పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్‌లో జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్ర హానికి, పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఉరవకొండ పట్టణంలో మొదటి సారిగా మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో, అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు.

Leave a Reply