Woman-Thanks-Lokesh : బసవతారకం ఆసుపత్రిలో.. Andhra Prabha Top News

Woman-Thanks-Lokesh : బసవతారకం ఆసుపత్రిలో.. Andhra Prabha Top News

నాకు పునర్జన్మ
కొక్కిలిగడ్డ మహిళ కృతజ్ఞతలు

( ఆంధ్రప్రభ, కొక్కిలిగడ్డ )

Woman-Thanks-Lokesh : క్యానర్స్ తో పోరాడుతున్న ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలిచి వారి ప్రాణాలు నిలిపింది బసవతారకం ఆసుపత్రి. ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడుతున్న తనకు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పునర్జన్మ ఇచ్చిందని కొల్లి దమయంతి మంత్రి నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డలో జడ్పీ స్కూల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ ను అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కొల్లి దమయంతి కలిశారు. క్యాన్సర్ వ్యాధిబారిన పడిన తాను రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నానని మంత్రికి వివరించారు. నాణ్యమైన వైద్యసేవలు తక్కువ ఖర్చుతో అందించారని.. అక్కడి వైద్యులు, సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ.. బాలయ్య మావయ్య బసవతారకం ఆసుపత్రిని సమర్థంగా నిర్వహిస్తున్నారని, ఎంతోమంది పేదలకు అండగా ఆసుపత్రి నిలిచిందన్నారు.