సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సిట్ నివేదిక రెడీ !!
- సాయికృష్ణ హత్య కేసులో సిట్ విచారణ పూర్తి
- ఆరు గంటలపాటు విచారణ
- నేడు రాత్రి లేదా రేపు ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు చేసే అవకాశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం విచారణ ప్రక్రియను పూర్తి చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సిట్ అధికారులు సుమారు ఆదాదాపు ఆరు గంటలపాటు ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణ అనంతరం సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాశ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బయలుదేరారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిట్ బృందం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇక విచారణలో సేకరించిన వివరాలు, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజును నేడు రాత్రి లేదా మంగళవారం ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సాయికృష్ణ హత్య కేసులో సిట్ నివేదికలో ఏమి పేర్కొన్నారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
