మూడు రాష్ట్రాల్లో బీజీపీ గెలుపుపట్ల విజయోత్సవ ర్యాలీ…

మూడు రాష్ట్రాల్లో బీజీపీ గెలుపుపట్ల విజయోత్సవ ర్యాలీ…

జన్నారం, ఆంధ్రప్రభ : భారత దేశంలోని పశ్చిమబెంగాల్,అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు పట్ల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో ఈ సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా గుడి నుంచి ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా టపాసులు పేల్చి, అందరికీ సీట్లు తినిపిస్తూ,భాజా భజంత్రీల చప్పుళ్ల మధ్య నేతలు,కార్యకర్తలు నృత్యాలు చేస్తూ ఎంతో ఆనందంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య,ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రి నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, నేతలు రమేష్ గౌడ్, గోలి చందు,వీరాచారి, లక్ష్మీరాజం, దేవేందర్, అప్పాల జలపతి, గంగాధర్, సూర్యం, రమేష్ తిరుపతి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply