Admissions BRAOU 2026 | బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లు ప్రారంభం
Admissions BRAOU 2026 | బీఆర్‌ఏఓయూలో అడ్మిషన్లు ప్రారంభం
డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం
ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు..
టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా వివరాలు
Admissions BRAOU 2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) శుభవార్త తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాల కోసం యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, గృహిణులు, విద్యను మధ్యలో నిలిపివేసిన వారు, దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా నిలవనుంది.
యూనివర్సిటీ ఆధ్వర్యంలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో కూడా అడ్మిషన్లు చేపడుతున్నారు. అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ అధికారిక వెబ్‌సైట్ లేదా అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆగస్టు 7ను చివరి తేదీగా నిర్ణయించారు. అర్హతలు, కోర్సుల వివరాలు, ఫీజు నిర్మాణం తదితర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
అడ్మిషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 1800 599 0101 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని యూనివర్సిటీ వెల్లడించింది. దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
