Singareni | షరతులతో కూడిన బెయిల్ మంజూరు
రూ.25 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశం
Singareni | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం బాల్క సుమ రూ.25 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించడంతో పాటు ఇద్దరి పూచీకత్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ షరతులు పాటించిన తర్వాత బెయిల్ ప్రయోజనం వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
సింగరేణి సంస్థకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న న్యాయస్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయంతో బాల్క సుమకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.
