ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం

ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం

రాప్తాడు, ఆంధ్రప్రభ : విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్స్ చాలా ముఖ్యమని అప్పుడే వాళ్లకు సంపూర్ణ నైపుణ్యం వస్తుందని కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ తెలిపారు.రాప్తాడు మండల పరిధిలోని హాంపాపురం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు విద్యను అభ్యసిస్తున్న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్స్ లో భాగంగా బుక్కరాయసముద్రం వద్ద ఉన్న 220కెవి/132కెవి/33కెవి/11కెవి సబ్‌స్టేషన్ ఇండస్ట్రీని ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు.

ఈ సంధర్భంగా డి.ఇ.వెంకట రమణ మాట్లాడుతూ ఇలాంటి ఇండస్ట్రీ సందర్శన ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని తెలిపారు.విద్యార్థులకు సబ్‌స్టేషన్‌లోని 220కెవి/132కెవి/33కెవి/11కెవి ట్రాన్స్‌మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు ట్రాన్స్‌ఫార్మర్లు స్విచ్‌గేర్‌లు ప్రొటెక్షన్ సిస్టమ్స్ వంటి అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించాము. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా ఎలా నిర్వహించబడుతుందని భద్రతా చర్యలు ఎలా అమలు చేస్తారు అనే విషయాలను వివరించామని తెలిపారు.

ఇంజనీరింగ్ విద్యార్థులకు అన్ని విషయాలు క్లుప్తంగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ డి.ఈ వెంకటరమణను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎం.డి.వెన్నెపూస రమాకాంత్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ టి.విష్ణు వర్ధన్ చైర్మన్ బి.వి.కృష్ణా రెడ్డి వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.జ్యోతి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డి.షేక్షావలి అధ్యాపకుడు దండు శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply