ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్…

వెల్దండ, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్న రాచూర్ గ్రామ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్. ఎన్నికల సమయంలో ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ. 10,116 అందిస్తానని ప్రకటించిన ఆయన, ఇచ్చిన మాట ప్రకారం శనివారం రాచూర్ గ్రామంలో కొంగళ్ల శ్యామలమ్మ, ఐలేన్ దంపతుల రెండవ కుమార్తె వివాహానికి రూ. 10,116ను పెళ్లి కానుకగా వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సురేష్ రెడ్డి, శంకర్, శీను, శ్రీశైలం, మధర్, గంగాధర్, రమేష్, దుబ్బ కృష్ణయ్య, రాస్కె జంగయ్య, గుత్తి ఎల్లయ్య, కొంగళ్ల మల్లయ్య, పాండు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply