Mopi devi: దుర్గానాగేశ్వరుని సన్నిధి కిటకిట Andhra Ptabha Spot News
Mopi devi: దుర్గానాగేశ్వరుని సన్నిధి కిటకిట Andhra Ptabha Spot Newsa
మోపిదేవి – ఆంధ్రప్రభ

మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలోని శ్రీ దుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినం కావటంతో ఆదివారం భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఉదయాన్నే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు.

సుమారు 60 వేల మందికిపైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం విచ్చేశారు. శివనామస్మరణతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల కోసం పులిహోర ప్రసాదాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో అందించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

