ఆలేరు ఆంజనేయ ఆలయంలో భక్తుల సందడి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బొడ్రాయి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు ఆలేటి రంగన్న పంతులు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి విశేషాలంకరణ ప్రత్యేక పూజలు జరిగాయి. పంతం కృష్ణ, నంద గంగేష్, సబ్బని సుభాష్ తో పాటు పలువురు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు.