ఘనంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

పట్టణంలోని మిర్యాలగూడెం రోడ్డులో భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం ప్రజాభవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ అమర్ గౌడ్, దొడ్డ నరసింహారావు, పచ్చిపాల ఉపేందర్, నగేష్ రాథోడ్, అన్నెం కొండారెడ్డి, అలీ, వీరమళ్ల సుందర్, రామిశెట్టి రాము, రాగి రాజశేఖర్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.