ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు..

ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను టీడీపీ నేతలు బుధవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. కొండపల్లి టీడీపీ కార్యాలయంలో ఓ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే వసంతను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తదితర నేతలు దుశ్శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్యేకు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply