ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్…

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్…

  • రూ.50వేల లంచం తీసుకుంటూ..
  • అధికారులకు పట్టుబడిన వైనం

హుజురాబాద్, ఆంధ్రప్రభ : లంచం తీసుకుంటూ.. మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ రూ. 50వేల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం పట్టుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ నుసుమ్ సుధాకర్ రెడ్డి వాన నీటి కాలువ పనుల బిల్లును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహ‌రించి అవినీతి అధికారి ఆట కట్టించారు. రూ. 50వేల లంచం తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకొని నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అవినీతి అధికారిపై విచారణ కొనసాగిస్తున్నామని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

Leave a Reply