ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..!

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..!
లారీ డ్రైవర్, యజమానులపై కేసు నమోదు..
పోలీస్ స్టేషన్ లో రెండు లారీలు
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం ఎక్స్ రోడ్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా రెండు లారీ నెంబరు టీఎస్ 07యుఎఫ్ 3366గల ఎం హెచ్ 34 వైవ్ 9494 గల లారీ ఆర్మూర్ వైపు వెల్లుచుండగా తనిఖీ చేయుచుండగా లారీ డ్రైవర్ ను విచారించగా కోరుట్ల నుంచి ఆర్మూర్ కు తరలిస్తున్నామని లారీ డ్రైవర్ తెలిపారు. దానిలో ప్రభుత్వ అయినటువంటి ఇసుక ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఎస్సై తెలిపారు.
లారీ డ్రైవరు ఆర్మూర్ మండలంకు చెందిన వ్యక్తి,ఒకరు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.వారు అక్రమంగా డబ్బులు సంపాధిచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఇసుకను జగిత్యాల జిల్లా లోని కథలాపూర్ మండలంలో వాగు నుంచి అక్రమంగా తరలించి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఎస్పై తెలిపారు. పంచనామా నిర్వహించి ఇసుకతో లారీ ని వేల్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి లారీ సీజ్ చేసి డ్రైవర్లు పై లారీ యజమానుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్పై సంజీవ్ సూచించారు.
