చుక్కపల్లి విజయ్ కుమార్ కన్నుమూత…
- తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి..
( భవానిపురం, ఆంధ్రప్రభ ) : పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ ఆకస్మిక మృతి పట్ల మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి
(సుజనా చౌదరి) తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు..
ఆయన మరణం వ్యాపార, సామాజిక వర్గాలకు తీరని లోటన్నారు..
అంకిత భావంతో చుక్కపల్లి విజయ్ కుమార్ అందించిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
