తుని నుండి గుంటూరుకు అక్రమ రవాణా

తుని నుండి గుంటూరుకు అక్రమ రవాణా
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నం నుండి పెడన హైవే పై హర్ష కాలేజ్ సమీపంలో అనుమానాస్పదంగా ఆవులను తరలిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ, ఇందులో పాల్గొన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా చర్యలు కొనసాగిస్తున్నారు.
