MLA | ఆత్మగౌరవం, సమైక్యతకు ప్రతీక సంక్రాంతి

MLA | ఆత్మగౌరవం, సమైక్యతకు ప్రతీక సంక్రాంతి
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
- సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
- విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాము…
- ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
MLA | నందివాడ – ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ తెలుగువారి ఆత్మగౌరవానికి, సమైక్యతకు ప్రతీక అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఈ రోజు ఘనంగా జరిగాయి. సందడి వాతావరణంలో జరిగిన వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి నాయకులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగవల్లుల ముగ్గుల పోటీలలో వివిధ ఆకృతులలో మహిళలు వేసిన ముగ్గులను ఆయన పరిశీలించారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే రాము బహుమతులను అందించారు.

వేడుకల్లో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజానీకానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి పండుగలు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ మాతృభాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

కొత్త సంవత్సరంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, చేకూరు జగన్మోహన్రావు, సింగవరపు ప్రభాకర్, ఉప్పల వెంకటేశ్వరరావు, కుర్మా శ్రీను, తమ్మారెడ్డి శ్రీను, DC ఏసుబాబు, గ్రామ పార్టీ సర్పంచ్ ఝాన్సీ, కత్తుల బాబ్జి, పార్వతనేని విజయప్రసాద్, పోలుకొండ గంగాధరరావు, బోర్ర సత్యనారాయణ, బోర్ర శాంతి, సుష్మ, బోస్ రాజు, నరసింహారావు, ప్రతిమ, సంక్రాంతి సంబరాల కమిటీ పెద్దలు, మండల ప్రముఖులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
