TG | మహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్ మంజూరు

TG | మహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్ మంజూరు
- స్థలాన్ని పరిశీలించిన జేసీ భాస్కరరావు
TG | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలలో భాగంగా మహిళలను అభివృద్ధి పథంలో నడపడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా సమాఖ్యకు పెట్రోల్ బంక్ మంజూరు చేసి పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం ఇవాళ చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ సర్వేనెంబర్ 486లో గల 20గుంటల భూమిని జేసీ భాస్కర రావు, డీఆర్ డీఓ నాగిరెడ్డి లు పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ వీరాభాయి, ఆర్ఐ బాణాల రామ్ రెడ్డి, ఏపీఎం యాదయ్య, మండల సమాఖ్య కమిటీ మెంబర్లు ఉన్నారు.
