జొన్నగిరికి చేరుకున్న సీఎం చంద్రబాబు

కర్నూలు, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం చేరుకున్నారు. జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు తొలి ప్లాంట్ యూనిట్ ప్రారంభోత్సవంతో పాటు రెండో ప్లాంట్ యూనిట్‌కు శంకుస్థాపన చేసేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడికి విచ్చేశారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గోల్డ్ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం తొలి ప్లాంట్ యూనిట్‌ను ప్రారంభించి, రెండో ప్లాంట్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుండగా, ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.