Minister | సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..

Minister | సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..
Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అమీన్పూర్ మాజీ ఎంపీటీసీ అనిత శేఖర్ రెడ్డి, బిజ్వార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగేష్ గౌడ్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్పూర్, బిజ్వార్ గ్రామాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిరంతరం మహిళా సాధికారత కోసం పాటుపడుతూ ఇందిరమ్మ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నారనిఅన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడంతో పాటు ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్(Reservation) కల్పిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూగూడు లేని పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ చీరలు పూర్తి నాణ్యతతో మహిళలకు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అశోక్ గౌడ్, మహ్మద్ రఫీ, మాజీ సర్పంచ్ సావిత్రమ్మ వెంకట్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , రాజప్ప గోవర్ధన్ రెడ్డి సిద్దు నారాయణ గౌడ్ ఆంజనేయులు బాబమ్మ తదితరులు పాల్గొన్నారు.
