రేవంత్ కి మోడీ పిలుపు

రేవంత్ కి మోడీ పిలుపు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి రాజకీయాలు మాటడబోనని అన్నారని, నేను కూడా రాజకీయాల గురించి మాట్లాడటం లేదని.. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు, గుజరాత్ తరహాలో చేస్తే మీకు సగం నిధులే వస్తాయి.. ఈ నిధులే మీకు సరిపోతాయా? ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశంపై పడకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రధాని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply