Danam Nagender|కేటీఆర్‌.. మా భూమిని లాక్కున్నాడు

Danam Nagender|కేటీఆర్‌.. మా భూమిని లాక్కున్నాడు

నా సొంత భూమిని వ‌దల్లేదు
నా తండ్రి భూమిని తీసుకొని ప్రైవేట్ కంపెనీకి అప్ప‌గించిన కేటీఆర్‌
కేటీఆర్‌పై దానం నాగేంద‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ఇరు వ‌ర్గాల ప్ర‌త్య‌క్ష ఆరోప‌ణ‌ల‌తో అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కింది. భూక‌బ్జాల‌పై ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఆరోప‌ణ‌ల వార్ కొన‌సాగింది. ఆ క్ర‌మంలో కేటీఆర్‍పై ఎమ్యెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ వేల ఎకరాల భూ కుంభకోణం చేశార‌ని, మా సొంత భూమిని కూడా వదల్లేదన్నారు. నా తండ్రి భూమిని కేటీఆర్ ఓ ప్రైవేట్ కంపెనికీ అప్పగించారన్నారు. ఎవరికీ చెప్పుకోలేక అప్ప‌ట్లో నోరు మూసుకున్నామ‌న్నారు. హైదరాబాద్‍లో పుట్టి పెరిగిన మేము మౌనంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూపిస్తాన‌న్నారు. బాలానగర్ ప్రాంతంలో జరిగిన భూముల స్కామ్‌లపై దానం తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తన భూమి మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.భూకుంభకోణాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply