Deeksha Divas | 29న దీక్షా దివస్‌…

Deeksha Divas | 29న దీక్షా దివస్‌…

  • రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ సన్నాహాలు
  • జిల్లా పార్టీ కార్యాలయాల్లో కేసీఆర్‌ కటౌట్లకు క్షీరాభిషేకాలు
  • గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి వరకు కదలనున్న గులాబీదళాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తరతరాల దోపిడీకి, విక్షతకు వ్యతిరేకంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మృత్యుకుహరాల్లోకి వెళ్లేందుకు సిద్ధ పడిన గులాబీ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ తలపెట్టిన దీక్ష దివస్‌ను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుచేస్తూ కార్యక్రమాలు నిర్వహిం చేందుకు బీఆర్‌ఏస్‌ సిద్ధమైంది.

తెలంగాణ కోసం కేసీఆర్‌ తలపెట్టిన ఆమరణ దీక్ష ఫలితంగా అప్పటికే ఎన్నెన్నో దారుల్లో చీలిన తెలంగాణ ఉద్యమం ఏకమై కదన రంగంలోకి ఉవ్వెత్తున దూసుకుపోయింది. భారత స్వాతంత్య్ర పోరా టాల అనంతరం అదే స్ఫూర్తితో గాంధేయ మార్గంలో నిర్వహించిన తెెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కేసీఆర్‌ రగిలించిన జననినాదంతో రాష్ట్రం ఆవిర్భవించింది.

2009 నవంబర్‌ 29న నిరాహార దీక్ష మొదలు పెట్టిన కేసీఆర్‌ డిసెంబర్‌ 9న తెలంగాణ ఇస్తున్నట్లుగా కేంద్రం ప్రకటన వెలుబడిన అనంతరం 11 రోజుల దీక్షను విరమించారు. నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ కేసీఆర్‌ తలపెట్టిన ఆమరణ నిరహార దీక్షను నేటి తరానికి గుర్తుచేస్తూ నవంబర్‌ 29న దీక్షా దివస్‌ పేరుతో సంబురాలు చేసేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది.

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయివరకు దీక్ష దివస్‌ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లా నాయకులతో ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ”తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ చచ్చుడో” నినాదంతో ప్రారంభించిన దీక్ష ఫలించి తెలంగాణ ఆవిర్భవించింది.

ఈ నేపథ్యంలో దశల వారీగా జరిగిన ఉద్య మాలు, ప్రాణ త్యాగాలను స్మరిసూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పక్కా కార్యా చరణతో ముందుకు వెళ్లుతోంది. రాష్ట్రంలోని 119 నియో జకవర్గాల కేంద్రాల్లో కేసీఆర్‌ భారీ కటౌట్‌ లు ఏర్పాటు చేసి క్షీరాభిషేకాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అలాగే దీక్షా దివస్‌ సందర్భంగా గ్రామాల్లో గులాబీ దళాలు సమావేశాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. గ్రామ పంచాయితీ స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు సభలు సమావేశాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ కార్యా లయాల్లో ఈనెల 29న గులాబీ జెండా ఎగరవేసిన అనంతరం సమావేశాలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

28వ తేదీనాటికి ఏర్పాట్లు పూర్తి కావాలని పార్టీ అధిష్టానం జిల్లా స్థాయి నాయకత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాన వేడుక నిర్వహిం చేందుకు ఏర్పాట్లు జురుగుతున్నాయి. ఈ సందర్భం గా జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు రాష్ట్ర కార్యాల యంలో తెలంగాణ ఉద్యమ ఘట్టాల ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసున్నారు.

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంతో పాటు.. హైదరాబాద్‌ కూడళ్లలో కేసీఆర్‌ 40అడుగుల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిల్లో సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రధానంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో సభలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించడంతో పాటు అమరుల కుటుంబసభ్యులకు సన్మానాలు ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.

జిల్లాలవారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు,కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు కమిటీలుగా ఏర్పడి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందు కు సిద్ధమవుతున్నారు. 29న ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పార్టీ కార్యాలయపు ఆవరణలో భారీ ఎల్‌ఈడీలతో పాటు.. నాటి ఉద్యమం వీడియో చిత్రాలను ప్రదర్శించ నున్నారు. దీక్షాదివస్‌లో రాజకీయ ఉపన్యాసాలు కాకుండా నాటి ఉద్యమ స్మృతులను, దీక్షా వివరాలను వివరించే ప్రత్యేక్ష సాక్ష్యులతో మాట్లాడించనున్నారు. అలాగే ఆస్పత్రులలో పండ్లపంకంతో పాటు సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు.