Journalists | జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

Journalists | జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

  • మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ డిమాండ్

Journalists | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేటకు చెందిన జర్నలిస్టులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు సకాలంలో బస్సులు నడపడం లేదని ఆర్టీసీ డిపో(RTC Depot) ముందు ధర్నా చేస్తుంటే కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.

రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో న్యాయం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరి పైన కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటైందని ఆయన అన్నారు. సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల(Journalists)పైన అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

అక్రమ కేసులు పెట్టిన నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన సమయంలో బస్సులు నడిపించాల్సిన డిపో మేనేజరు(Depot Manager) జర్నలిస్టులపై కేసులు పెట్టి తప్పించుకోవాలని చూడడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు విచారణ జరిపించి జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి లేని పక్షంలో వారికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఉద్యమాలను చేపడుతుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply