ఫిర్యాదుల‌పై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌

ఫిర్యాదుల‌పై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌

జగిత్యాల, ఆంధ్రప్రభ : బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కార‌ చర్యలు తీసుకుంటూన్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్(SP Ashok Kumar) అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే(Grievance Day)లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది ఆర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ(SP) మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖ(Police Department)ను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదు దారునికి భరోసా(Bharosa), నమ్మకం కలిగించాలన్నారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్(Online)లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.