AP | ప్రధానోపాధ్యాయుడే కీచకుడు.. చితక్కొట్టిన పేరెంట్స్

ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎం మల్లేశ్వర్ కు ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ది చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్ధినీలపై ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజూ లైగింక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాలకు భారీగా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు చేరుకొని ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్ కు దేహశుద్ది చేశారు.

అనంతరం హెచ్ఎం పరారైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్ధి, యువజన సంఘాల నేతలు పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. విద్యాబోధన చేయవలసిన గురువులు ఆ పాఠశాలలో చదివే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ‌టం చాలా దారుణమైన సంఘటన అన్నారు. ఇలా చేయటం వారికి సిగ్గుచేటని ఆ టీచర్ కు కూడా కూతుర్లు ఉంటారు కదా అని ప్రశ్నించారు.

అభం, శుభం తెలియని చిన్న పసిపిల్లలపైన ఇలాంటి పనులకు పాల్పడిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్ ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా హెచ్ఎం మల్లేశ్వర్ ను వెంటనే సస్పెండ్ చేసి అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన సంఘటనపై మండల విద్యాశాఖ అధికారి కోటయ్య విచారణ జరుపుతున్నారు.

స్పందించిన జిల్లా కలెక్టర్..
జరిగిన సంఘటనను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించటం విశేషం. ఆ ప్రధానోపాధ్యాయుడికి వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేయాలని నివేదిక ఇచ్చిన తర్వాత సస్పెన్షన్ కు రంగం సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.జనార్దన్ రెడ్డిని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *