రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది..

రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది..

ఏ.పీ. సాదు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి

తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ఏపీ సాదు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస నంద సరస్వతి తెలియజేశారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలోమాట్లాడుతూఏ.పీ. సాధు పరిషత్ ఏ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో256దేవాలయాలపై దాడులు చేయడం జరిగిందని గుర్తు చేశారు.. గతంలో కూడా ముంతాజ్ బేగం హోటల్ కట్టడాలు నిలుపుదల చేయాలని ఆందోళన చేయడం జరిగిందని వివరించారు.

వైసిపి పార్టీకి హిందూతత్వం మీద ఈర్ష ఎందుకని ప్రశ్నించారు. కాషాయం ఈ సమాజానికి అవసరమన్నారు. అనంతరం ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు అట్లూరి నారాయణరావు మాట్లాడుతూటిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చౌక బారు ఆరోపణలు చేయడం మానుకోవాలని దమ్ము ధైర్యం ఉంటే స్వాములు మింద చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలన్నారు. తమపై చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రమాణం చేయడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి, కాణిపాకం గుడికి అయిన ప్రమాణం చేయడానికి వస్తామని కరుణాకర్ రెడ్డి నిరూపించాలనికోరారు. నిరూపించకపోతే ఇంటిలో ఉండాలని తెలిపారు.

తాము చేస్తున్నటువంటి వాటికి బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు.ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చడం జరిగిందని ఆరోపించారు. అన్ని మతాలను గౌరవించాలని కోరారు.జిరాక్స్ మిషన్ పెట్టుకుని ఉన్న కరుణాకర్ రెడ్డి వేలకోట్ల రూపాయలుడబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

హిందూ ధర్మాన్ని కాలరాసే పార్టీ వైసీపీ పార్టీని తెలియజేశారు. హిందువులు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సనాతన ధర్మం గౌరవిస్తున్న వాళ్లకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తదనంతరం తిరు నేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్ మాట్లాడుతూతిరుపతి నగరంలో నగర సంకీర్తన చేస్తే దానికి శ్రీవారి సేవకులు తీసుకుని వచ్చి ర్యాలీ చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.చిల్లర రాజకీయం మానుకోవాలని కోరారు. కాషాయం కనబడితే కరుణాకర్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని గుర్తు చేశారు.

Leave a Reply