Medaram | విప‌రీతంగా భ‌క్తుల తాకిడి….

Medaram | విప‌రీతంగా భ‌క్తుల తాకిడి….

Medaram | మేడారం, ఆంధ్ర‌ప్ర‌బ : వన దేవతల జాతర సందర్బంగా… మేడారంకి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. మహా గట్టంలోని మొదటి ఘట్టం… ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుండి సారాలమ్మ గద్దెకి రానుంది. ఈ నేపథ్యంలో అటు పూజారులు… ఇటు వివిధ శాఖల అధికారులు తగు ఏర్పాట్లు చేసారు. గద్దెల వద్ద ఎత్తు బంగారం ఇచ్చేందుకు దేవాదాయ షాఖ అధికారులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సులభంగా దర్శనం జరిగేలా పోలీస్, వాలంటీర్లు, రెవిన్యూ తదితర శాఖలకు సంబందించిన అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు జాతరకు వచ్చినప్పటి కంటే ఈసారి దర్శనం చాలా తొందరగా పూర్తి అయ్యిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply