విష్ణుభట్ల సూర్యనారాయణ ఇకలేరు..

విష్ణుభట్ల సూర్యనారాయణ ఇకలేరు..

విశ్వనాధపల్లి మునసబ్బుగా పేరుగాంచిన సూర్యనారాయణ మృతి

కోడూరు, ఆంధ్ర ప్రభ : విశ్వనాధపల్లి గ్రామంలో విషాదఛాయలు దివంగత మండలి వెంకటకృష్ణారావుకి అత్యంత సన్నిహితులు సూర్యనారాయణ విష్ణుభట్ల సూర్యనారాయణ(83) ఇక లేరు. ఈరోజు తెల్లవారుజామున విజయవాడలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. విశ్వనాధపల్లి మున్సబ్ గా పేరుగాంచిన విష్ణుభట్ల సూర్యనారాయణ. దివంగత దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావుకి అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన సూర్యనారాయణ విశ్వనాధపల్లి లో ప్రముఖులు. డిసి చైర్మన్గా, అద్దంకి నాంచారమ్మ దేవస్థానం పాలకమండలి చైర్మన్, విశ్వనాథపల్లి ప్రాథమిక వ్యవసాయపరపత సంఘం అధ్యక్షులుగా పనిచేసి ప్రజల యొక్క మన్నలను పొందారు.దివి సీమ లో విష్ణుభట్ల సూర్యనారాయణ అంటే వ తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. విష్ణుభట్ల సూర్యనారాయణ మృతితో విశ్వనాథపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..

Leave a Reply