Handed-Over-Family : అతడె దొరికాడు Andhra Prabha Crime News
Handed-Over-Family : అతడె దొరికాడు Andhra Prabha Crime News
- ఫ్యామిలీ హ్యాప్లీ
- అప్పగించిన ఏర్పేడు బ్లూకోట్స్

(ఏర్పేడు, ఆంధ్రప్రభ)
Handed-Over-Family : తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ నుంచి తప్పిపోయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని ఏర్పేడు పోలీసులు సురక్షితంగా గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల వివరాల ప్రకారం… శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, ధీరసం గ్రామానికి చెందిన సంతోష్ (32, తండ్రి: దివంగత నారాయణరావు) అనే వ్యక్తి ఆదివారం (ఆగస్టు 2) ఉదయం 7 గంటల సమయంలో తిరుమల సర్వదర్శనం క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి దారి తప్పిపోయాడు.
అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1 గంట సమయంలో అతను ఏర్పేడు టౌన్‌లో అటూ ఇటూ తిరుగుతుండగా డ్యూటీలో ఉన్న పోలీసు బ్లూకోల్ట్స్ సిబ్బంది గమనించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం సంతోష్ వివరాలు సేకరించి, అతని తల్లికి మరియు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులకు సంతోష్‌ను భద్రంగా అప్పగించారు. సమయానికి స్పందించి తమ వ్యక్తిని సురక్షితంగా అప్పగించినందుకు బ్లూకోల్ట్స్ సిబ్బందికి, ఏర్పేడు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
