దుర్గగుడి ఈవో వీ.కే. శీనా నాయక్‌కు మాతృవియోగం
- అనంతపురం జిల్లా స్వగ్రామంలో లక్ష్మీబాయి (65) కన్నుమూత..
- దేవస్థాన అధికారులు, భక్తులు సంతాపం
ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీ.కే.శీనా నాయక్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీబాయి (65) ఆదివారం అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలోని స్వగ్రామం ఆవుల గట్ల తండాలో కన్నుమూశారు.
లక్ష్మీబాయి మృతితో శీనా నాయక్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన దేవస్థాన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వీ.కే. శీనా నాయక్ ప్రస్తుతం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
