ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ర్యాలీ..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ర్యాలీ..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని 6 వ వార్డులో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం తొలి రోజు మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య లు స్థానిక ఇందిరానగర్ కాలనిలో ర్యాలీని స్వయంగా ప్రారంభించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు మున్సిపాలిటీలో 99 రోజుల వరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రజలు ఆయా ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, పథకాల్లో లబ్ధిదారులుగా ఉండాలని ఆకాంక్షించారు.

ర్యాలీ అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్, కౌన్సిలర్లు కూర్మిళ్ల ప్రమీల, సుల్తాన్ స్వామి, కొండ శోభ, మొగుళ్ళ అనురాధ, గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య, బీసు శ్రీకాంత్ గౌడ్, నల్ల మధు, కారుపోతుల వెంకన్న గౌడ్, మెప్మా, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు గడ్డం లక్ష్మయ్య, విబికె లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply