ప్రజల ఆరోగ్యసంరక్షణ కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రజల ఆరోగ్యసంరక్షణ కూటమి ప్రభుత్వ లక్ష్యం
- పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
పెడన, ఆంధ్రప్రభ ; పెడన మండలం కొంకేపూడి, ఈదుముడి గ్రామాలలో కీ”శే” కాగిత వెంకట్రావు జలధారణ ద్వారా నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు త్రాగు నీరు అందించాలని దృడ సంకల్పంతో వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది అని తెలిపిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

