వరద ప్రభావిత ప్రాంతాల్లో డీపీవో పర్యటన
శిథిల ఇళ్ల పరిశీలన..
పారిశుద్ధ్యంపై అధికారులకు సూచనలు
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న శిథిలావస్థలో ఉన్న ఇంటిని గురువారం డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవో రాధా రాథోడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా నష్టపరిహారానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
అనంతరం మేడంపల్లి గ్రామంతో పాటు సదర్ మాట్ అనికట్ను సందర్శించారు. వర్షాకాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించిన అధికారులు, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. బ్లీచింగ్ పౌడర్, బయోలార్వా, ఫాగింగ్ మిషన్ ఆయిల్ బాల్స్ వంటి సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
