భక్తిశ్రద్ధలతో అమ్మవారికి గోరింటాకు కార్యక్రమం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్, జంగల్ హనుమాన్ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ‘అమ్మవారికి గోరింటాకు’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి గోరింటాకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఏపీపీఎస్సీ సభ్యుడు రవీందర్‌రావు సతీమణి ఉమాదేవితో పాటు పట్టణానికి చెందిన ప్రముఖ మహిళలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మహిళలు, నిర్వాహకులు, భక్తులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ వీరాంజనేయ శివ సాయి సమాజ్ ఆలయ కమిటీ తరఫున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
