కల్లు డబ్బులు ఇవ్వలేదని పోలుకు కట్టేసి..

కల్లు డబ్బులు ఇవ్వలేదని పోలుకు కట్టేసి..

  • జైపూర్ మండలం కుందారంలో దారుణం

జైపూర్, ఆంధ్ర ప్రభ : జైపూర్ మండలం కుందారం గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుందారం గ్రామ పంచాయతీకి చెందిన ఎర్ర చంద్రయ్య అనే వ్యక్తి అనాథ అక్కడికే చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కల్లు డబ్బులు చెల్లించలేదనే కారణంతో ఎర్ర చంద్రయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన గీత కార్మికుడైన మల్లాగౌడ్ లాక్కెళ్లి పోల్ కి కట్టేసిన ఘటన ప్రస్తుతం పై గ్రామస్తులు మండి పడుతున్నారు. గతంలో చంద్రయ్య అనే వ్యక్తితో మల్లా గౌడ్ పనులు చేయించుకొని బదులు కల్లు పోసేవాడని గ్రామస్తులు తెలిపారు. ఏదేమైనా ఒక వ్యక్తిని పోలుకి కట్టేయడం అప్పు తీర్చాలంటూ బూతులు తిడుతూ వేధింపులకు గురి చేస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

రజాకార్ల వ్యవస్థను తలపించేలా ఎర్ర చంద్రయ్య అనే వ్యక్తిని గీత కార్మికుడైన మల్లాగౌడ్ కట్టేయడం అమానుషం అన్నారు. చంద్రయ్యకు ముందూవెనకా ఎవరు లేరనే మల్లాగౌడ్ ఇలాంటి సాహసానికి ఒడికట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన మల్లాగౌడ్ ఇలాంటి వికృత చేష్టలను సహించేది లేదన్నారు. మల్లాగౌడ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయం పై మానవహక్కుల సంఘం దృష్టి కి తెలిసుకు వెళ్తామని తెలిపారు.

-కుందారం మాజీ సర్పంచ్ ఇజ్జగిరి సమ్మయ్య

Leave a Reply