భక్తిశ్రద్ధలతో గంగపుత్ర సంఘం బోనాల పండుగ
లక్కోర గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఉత్సవాలు
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గంగపుత్ర బట్టు పెద్ద సంఘం ఆధ్వర్యంలో గ్రామ మహిళలు నూతన వస్త్రాలు ధరించి ఇంటికో బోనం చొప్పున తీసుకొచ్చారు. డీజే వాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి, గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి గ్రామ గంగపుత్ర ముద్దుబిడ్డ, రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉట్నూర్ సుభాష్, గ్రామ సర్పంచ్ దాసరి అపర్ణ రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బైరి శ్రీధర్, ఉప సర్పంచ్ అడవుల ఆత్మరామ్, హెడ్ కానిస్టేబుల్ చాదల మనోహర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బట్టు నరేందర్, బట్టు శంకు, బట్టు జంగయ్య, బట్టు లక్ష్మణ్, మాడవేడి ప్రదీప్ కుమార్, బట్టు సాయన్న బుజ్జి, బట్టు రామకృష్ణ, మండలం సాయిలు, ఆర్ అండ్ బి సాయిలు, మిట్టపల్లి సాయిలు, మిట్టపల్లి చిన్న సాయిలుతో పాటు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
