హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి: లలిత గాయత్రీ మాతాజీ

హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి: లలిత గాయత్రీ మాతాజీ

చిట్యాల, (ఆంధ్రప్రభ): హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లలిత గాయత్రీ మాతాజీ పిలుపునిచ్చారు. హనుమాన్ సేవ సమితి వ్యవస్థాపకులు రావుల సాయిరెడ్డి స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి భగవద్గీత పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీకి భగవద్గీతను అందజేశారు. ఈ సందర్భంగా హిందూ సనాతన ధర్మం, దేశాభివృద్ధి కోసం హిందువులంతా సంఘటితంగా ఉండాలని, మతమార్పిడులకు ఆస్కారం లేకుండా సమాజం ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో హనుమాన్ భక్తుడు రాయమల్లు పాల్గొన్నారు.