పెద్ద చెరువులో చేపల వేట..

పెద్ద చెరువులో చేపల వేట..
- వినూత్న ఆలోచనకు శ్రీకారం
- చేపల వేట కోసం సులువైన మార్గం
సంగెం, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లని నరకకుండా ఆలోచనతో మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన అశోక్ పైపులతో కూడిన పడవలను తయారు చేశాడు. వివరాల్లోకెళ్తే గతంలో కర్రలతో కూడిన పడవలు తయారు చేసేవారు. వాటి తయారీ కోసం ఎన్నో చెట్లను నరికి వాటి కర్రలను తీసుకువచ్చి పడవలను తయారు చేసేవారు. దాన్ని చూసిన అశోక్ వి వినూత్న ఆలోచన చేసి పీవీసీ పైపులతో పడవను తయారు చేస్తే సురక్షితంగా ఉంటుందని చేపల వేట సులభతరం అవుతుందని ఆలోచన చేసి కర్రలకు బదులుగా పివిసి పైపులతో పడవలను తయారు చేశాడు.

ఇదే కాకుండా గణపురం మండలంలో తనకు ఉన్నటువంటి చెరువులో వేటకారులకు చేపల సంరక్షణ కొరకు చెరువు మధ్యలో డ్రమ్ములతో ఒక రూమును తయారుచేసి రాత్రి అంతా చేపల చోరీ కాకుండా సీసీ కెమెరాలు అమర్చి రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. మునుముందు మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేట సులభతరం చేయడం కోసం ఇంకా కొత్త కొత్త పరికరాలు తయారు చేసి, వేట సులభతరం చేస్తానని తెలిపాడు. దీన్ని చూసిన పలువురు అశోకు ఆలోచనలు స్వాగతిస్తూ అతన్ని అభినందించారు.
