ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో ఆషాఢ మాస సారె సమర్పణ..

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కేశఖండనశాల నాయి బ్రాహ్మణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢ మాస సారె కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యుల సమక్షంలో అమ్మవారికి సారె సమర్పించారు. కేశఖండనశాల నాయి బ్రాహ్మణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆలయాల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, ఏ.జీ.ఎల్. నారాయణ, ఆర్.వి. రమణ, జి. హరికిరణ్, ఎ. పూర్ణ కనకారావు, పి. సంతోష్, ఎ. రాంబాబు, ఆర్. రమణ, జి. సంతోష్, కె. కిషోర్, కె. సిద్ధయ్య, వై. సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిపారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగింది.