కంటేగావ్‌లో రూ.15 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

కంటేగావ్‌లో రూ.15 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

ఇచ్చోడ (ఆంధ్రప్రభ): బోథ్ మండలంలోని కంటేగావ్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం భూమిపూజ చేశారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. గతంలో సీసీ రోడ్లు లేని గ్రామంగా ఉన్న కంటేగావ్‌ను ఇప్పుడు మట్టి రోడ్లు లేని గ్రామంగా మార్చే దిశగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారం, ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలు కోరిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు సంజీవ్, రూప్‌చంద్, జాదవ్ రవీందర్, రవి, అంబాజి, సిర్సే సంజీవ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, బోథ్ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, బోథ్ వీడీసీ అధ్యక్షుడు పోతన్న, ఎలుక రాజు, మాజీ సర్పంచ్ దేవేందర్, రాథోడ్ రాము, సందీప్, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.