విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తా

ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తానని చిన్నపోర్ల సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపోర్ల సీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం సత్యనారాయణ, పాఠశాల హెచ్‌ఎం శశికళ, ఉప సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి రఫీ తదితరులు పాల్గొన్నారు.