విద్యార్థులకు స్టీల్ బాటిళ్ల పంపిణీ

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: అబ్దుల్ మజీద్ 63వ జయంతి సందర్భంగా క్యాతన్‌పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ అఫ్జల్ లాడెన్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థులకు బాటిళ్లు అందజేశారు.

ఈ సందర్భంగా లాడెన్ మాట్లాడుతూ తవక్కల్ స్కూల్ వ్యవస్థాపకుడు అబ్దుల్ మజీద్ పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. సమాజ సేవే ధ్యేయంగా ఎంతో మంది పేదలకు సహాయం చేసిన మహనీయుడని, ఆయన ఆశయాలను కొనసాగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ సంధ్యారాణి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాజా రమేష్, సయ్యద్ అఫ్జల్ లాడెన్, కంభగోని సుదర్శన్ గౌడ్, కాదండి సాంబయ్య, రామిడి కుమార్, లక్ష్మీకాంత్, వివిధ పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థులకు బాటిళ్లు అందజేయడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.