జూనియ‌ర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

ఉరుమడ్ల గ్రామంలో కేక్ క‌టింగ్‌

చిట్యాల మే 20 ఆంధ్రప్రభ : చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఉచిత వేసవి హాకీ శిక్షణ శిబిరంలో క్రీడాకారుల సమక్షంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మండల అభిమాన సంఘం నాయకులు ఉయ్యాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. క్రీడాకారుల సమక్షంలో కేక్ కట్ చేసి అల్పాహారం స్నాక్స్ స్వీట్స్ అందజేయడం జరిగింది.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి క్రీడలపై మానసిక ఆరోగ్యం పరంగా దృఢంగా ఉంటారని భవిష్యత్తులో క్రీడల ద్వారా ఉన్నంత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో హాకీ కోచ్ గంగాపురం రాము, అభిమాన నాయకులు,పాల బాలకృష్ణ,మాధగోని వెంకటేశం,మట్టి పెళ్లి నాగరాజు, సాగర్ల వెంకన్న,దండంపెల్లి భరత్ కొత్త లింగస్వామి, బండ్ల సైదయ్య,ఆనగంటి నరేష్, బోయ సాయికుమార్,మహ్మద్ సోయల్ తదితరులు పాల్గొన్నారు