ORR Helpline | సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్‌

ORR Helpline | సీపీ స‌జ్జ‌నార్ వార్నింగ్‌

ORR Helpline | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాలను నిల‌పొద్దని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఔట‌ర్ రింగ్ రోడ్డుపై జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు. బ్రేక్‌డౌన్ వంటి అత్యవసర పరిస్థితులు మినహా, ఔట‌ర్‌ పై వాహనాలను నిలపకూడదని, అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ఒకవేళ వాహనం ఆపాల్సి వస్తే, వెంటనే 14449 (ఓఆర్ఆర్‌ హెల్ప్‌లైన్) నంబర్‌కు సమాచారం అందించాల‌ని సూచించారు.

వాహనం ఆపాల్సి వస్తే ఎడమ వైపు చివరి లేన్‌లో మాత్రమే నిలిపి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమించి, అకారణంగా ఓఆర్ఆర్ పై వాహనాలు నిలిపే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపేవారిని “రోడ్డు టెర్రరిస్టులు”గా పరిగణిస్తామని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడటం, వాహనం నడుపుతూ రీల్స్ చూడటం ప్రమాదకరమని, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ ద్వారా ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.

Leave a Reply