indrakeeladri13thjune | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం..

indrakeeladri13thjune | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం..

indrakeeladri13thjune | శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు..
కనకదుర్గమ్మ దర్శనానికి 58 వేల మందికిపైగా భక్తుల రాక
ప్రత్యేక పూజలు, సేవల్లో ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసిన దేవస్థానం
అమ్మవారిని దర్శించుకున్న పోలీస్ కమిషనర్, కలెక్టర్

indrakeeladri13thjune | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్తులతో ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులకు చల్లటి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు

వివరాలు ఇలా..

indrakeeladri13thjune
indrakeeladri13thjune

దేవస్థానం గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 9,712 దర్శన టికెట్లు జారీ కాగా, మొత్తం 58,677 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 503 మంది భక్తులు వివిధ సేవల్లో పాల్గొన్నారు. 3,512 మంది తలనీలాలు సమర్పించగా, 9,920 మంది అన్నదాన సేవను స్వీకరించారు. అలాగే 1,10,335 యూనిట్ల ప్రసాదాలను విక్రయించగా, హుండీ విరాళాలు రూ.2,63,471లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అమ్మవారి దర్శనానికి ప్రముఖులు..

indrakeeladri13thjune
indrakeeladri13thjune

ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించడంతో దర్శనం ప్రశాంతంగా సాగింది.

indrakeeladri13thjune
indrakeeladri13thjune
indrakeeladri13thjune

click here to readఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం

click here to read more