తల్లి, తమ్ముడి దారుణ హత్య..

తల్లి, తమ్ముడి దారుణ హత్య..

తానే హత్య చేశానని పోలీసులకు ఫోన్ చేసిన శ్రీనివాస్..
మానసిక స్థితి, కుటుంబ సమస్యలే కారణమా..?
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి


భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా తెల్లవారకముందే ఉలిక్కిపడింది. భీమవరంలో తల్లిని, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడనే వార్త గుప్పు మంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

భీమవరం(Bhimavaram) లోని సుంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న గునుపూడి మహాలక్ష్మి (60), గుడి రవితేజ (33)లు నిద్రిస్తుండగా గునుపూడి శ్రీనివాస్ విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. తల్లి గునుపూడి మహాలక్ష్మి, తమ్ముడు గునుపూడి రవితేజ మృతి చెందారని నిర్ధారించుకుని గునుపూడి శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజాము 4:30 గంటలకు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. భీమవరం సుంకర పద్దయ్య వీధిలో మన్నా చర్చి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గునుపూడి శ్రీనివాస్ (Gunupudi Srinivas) మానసిక పరిస్థితి సరిగా లేదని, అతనికి వివాహం కూడా కాలేదని, ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి తమ్ముడు రవితేజతో నిందితుడు గొడవ పడ్డాడని, ఈ విషయంలో తల్లి కూడా శ్రీనివాస్ ను హెచ్చరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన శ్రీనివాస్ అర్ధరాత్రి రెండు, మూడు గంటల సమయంలో వీరిద్దరిపై దాడి చేసి హత్య చేశాడు. హత్యకు గురైన రవితేజ భీమవరంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. హత్యకు పాల్పడిన శ్రీనివాస్ కు మతిస్థిమితం సరిగా లేనట్లు చెబుతున్నారు.


సంఘటన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి (SP Adnan Naeem Azmi) పరిశీలించారు. నేరం జరిగిన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించడంలో భాగంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి ముఖ్యమైన కీలక ఆధారాలను సేకరించారు. ఈ ఘటనలో కుటుంబ సమస్యల కారణంగా హత్య చేశాడా.. ఫైనాన్స్ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ హత్యలకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలను సేకరిస్తున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేనట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ఎస్పీ తెలిపారు. ఈ సంఘటన అర్ధరాత్రి 1 గంట, 3 గంటల సమయంలో జరిగి ఉంటదని అన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ జయసూర్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ కెవివి సత్యనారాయణ, భీమవరం వన్ టౌన్ సీఐ ఎం. నాగరాజు పరిశీలించారు.

Leave a Reply