అక్రమంగా బెల్లం తరలింపు..
ఎక్సైజ్ శాఖ దాడిలో పట్టివేత
600 కిలోల నల్ల బెల్లం, 120 కిలోల పట్టిక బెల్లం స్వాధీనం.. స్కార్పియో వాహనం సీజ్
వెల్దండ, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల సమీపంలో ఎక్సైజ్ శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఎక్సైజ్ శాఖ సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, తలకొండపల్లి మండలం మొగిలి తండాకు చెందిన ఇస్లావత్ రాజు హైదరాబాద్లోని బేగంబజార్ నుంచి నాగర్కర్నూల్ జిల్లా మున్ననూరు గ్రామంలోని నాటుసారా తయారీదారులకు బెల్లాన్ని తరలిస్తుండగా పట్టుబడ్డాడు.
తనిఖీలో 600 కిలోల నల్ల బెల్లం, 120 కిలోల పట్టిక బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లం తరలింపునకు వినియోగించిన స్కార్పియో వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది జనార్దన్ రెడ్డి, సిద్ధార్థ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
