జూబ్లీహిల్స్‌లో మంత్రి వాకిటి ప్ర‌చారం

మక్తల్ , నవంబర్ 4 (ఆంధ్రప్రభ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మధురా నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు మద్దతుగా రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్లి అప్యాయంగా వారిని పలుకరించి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి 11వ తేదీన జరిగే పోలింగ్లో బ్యాలెట్ లో సీరియల్ 2 వద్ద ఉన్న హస్తం గుర్తుకి ఓటు వేయాలని మంత్రి కోరారు. ఓటమి భయంతో బి.ఆర్.ఎస్ పార్టీ ఫేక్ సర్వేలను ప్రచారం చేస్తుందని అన్నారు.

సోషల్ మీడియాను హస్త్రంగా చేసుకొని అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా బిఆర్ఎస్ ను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరని అన్నారు. కల్లబొల్లి మాటలకు ఇంకెన్నాళ్ళు చెప్తారు కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో 80 శాతం ప్రజలు రోజు కష్టపడితే తప్ప జీవనం కొనసాగించలేని పరిస్థితి ఉంది. 3 పర్యాయాలు బి.ఆర్.ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం ఇచ్చిన ఇక్కడ అభివృద్ధి శూన్యం అని అన్నారు.అందుకే ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే అని విశ్వసిస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు .రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు.వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించి కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలని మంత్రి వాకిటి శ్రీహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వర రావు,సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ దొండపాటి వేంకటేశ్వర్ రావు,కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్, వెంగళరావునగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ నాగార్జున్ రెడ్డి, వెంగళరావునగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేంద్రప్రసాద్,చిలకల వెంకటేశ్వరరావు,సోమ వినయ్,రేఖ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply